కీర్తి సురేష్ పై బాగా ఫైర్ అవుతున్నారటా అభిమానులు. తాజాగా ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు చూసి తెగ ఛీ కొడుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిfiురేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది మొదట మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతే సినిమా పరిశ్రమకు వచ్చింది.ఇక ఆమె సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.

తొలిసారిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపై అడుగు పెట్టగా.. తరువాత తమిళ సినిమాలలో కూడా నటించింది. ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయిందని చెప్పాలి.

సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు కూడా వచ్చిపడ్డాయి. పైగా మంచి అభిమానాన్ని కూడా ఆమె సంపాదించుకుంది. సర్కారు వారి పాటతో కూడా మంచి సక్సెస్ కూడా అందుకుంది కీర్తి. ఈ సినిమాల్లో ఏకంగా గ్లామర్ షో కూడా చేసి అందర్నీ బాగా ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటినుంచి బాగా గ్లామర్ షో చేసుకుంటూనే పోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

అందులో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తుంది.ఒకప్పుడుకీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా అయితే ఉండేది. అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ లోనే ఆమె కనిపిస్తుండేది. కానీ ఈ మధ్య గ్లామర్ ను కూడా పరిచయం చేసింది కీర్తి. కెరీర్ మొదట్లో చాలా బొద్దుగా ముద్దుగా ఉండేది. ఇక అవకాశాల కోసం బాగా వర్కౌట్లు చేసి బాగా సన్నబడింది. నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ ఎంతో అందంగా ఉండేది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ ను పంచుకుంది. అందులో తన అవుట్ ఫిట్ తో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తన అవుట్ ఫిట్ పైభాగం ఓపెన్ గా ఉండటంతో నెటిజన్స్ కూడా బాగా ఫైర్ అవుతున్నారు. మొదట్లో ఎంత పద్ధతిగా ఉండే దానివి ఇప్పుడు ఇలా తయారయ్యావు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: