మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ లవర్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరో గా నటించి గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ తన 16 వ మూవీ ని కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ తన కెరియర్ లో 16 వ మూవీ ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ "ఆర్ సి 16" మూవీ కి సంబంధించిన బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాజాగా రామ్ చరణ్ "ఆర్ సి 16" మూవీ గురించి మాట్లాడుతూ ... నేను మరో సంచలనాత్మకమైన పాత్రను చేయబోతున్నాను  ఈ పాత్ర రంగస్థలం మూవీ కంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ పాత్ర చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని రామ్ చరణ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: