
అది కూడా మరెవరో కాదు మెగా కుటుంబంలోనే ఈ జంట విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి కూతురు శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవత దూరంగా ఉంటోంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వీరిద్దరూ కూడా విడిపోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నాగబాబు కూతురు నిహారిక.. తన భర్త చైతన్యతో విడిపోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలలో నిహారిక హీరోయిన్ గా కూడా నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
నిహారిక, చైతన్యాలు ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లో చాలా ఘనంగా జరిగింది.వీరి పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. కానీ ఓటిటి మరియు యూట్యూబ్ లో చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. నిహారిక గతంలో ఒకసారి పబ్బులో దొరికిన తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ అదంతా నిజం కాదని తేల్చేశారు. అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరూ తప్పకుండా విడిపోవాలనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త రావడానికి ముఖ్య కారణం నిహారిక ఇంస్టాగ్రామ్ లో చైతన్య అన్ ఫాలో చేసింది.. అలాగే చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో చేశారు.. అక్కడితో ఆగకుండా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సైతం డిలీట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.