

కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు గ్లామర్ వలకబోస్తూ పలు ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం కాజల్ నటించిన ఘోస్టి సినిమా ప్రమోషన్ లో భాగంగా తెగ సందడి చేస్తోంది కాజల్. అప్పటికి ఇప్పటికి చెక్కుచెదరని అందంతో అదిరిపోయే ఔట్ ఫిట్లో స్టన్నింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈమె అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాజల్ అగర్వాల్ కం బ్యాక్ ఇస్తూ పలు ఫోటోలను నెట్టింట వైరల్ గా మారేలా చేస్తోంది. ఈమె ఫోటో షూట్లకు కుర్రకారు సైతం మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఘోస్టీ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా పలు ప్రయత్నాలు చేస్తుంది కాజల్ అగర్వాల్. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో కాజల్ అగర్వాల్ ఫోటోషూట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి. కాజల్ అగర్వాల్ ఎక్కువ సమయాన్ని తన కుమారుడికి కేటాయిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు పూర్వపు ఫిట్నెస్ కోసం పలు రకాలుగా జిమ్ లో కసరత్తులను.. వర్క్ అవుట్లను సైతం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కాజల్ సిట్టింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.