జూనియర్ ఎన్టీఆర్  సీఎం కావాలని కోరుకునే ప్రేక్షకుల సంఖ్య.బాగానే వుంది చంద్రబాబు ఎక్కడ పర్యటించినాకూడా సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు బాగా వినిపిస్తూ ఉంటాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సీఎం కావాలనే ఆలోచన ఉందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం లేదనే సమాధానం గట్టిగా వినిపిస్తుండటం సోషల్ మీడియాలో అలాగే వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీలో జరిగిన పట్ట భధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో బాలయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కొద్దిగా ఘాటుగా సెటైర్లు వేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఫలితాల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా కూడా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.. ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ను కాపాడుకోవడంతో పాటు మరిన్ని విజయాలను కూడా అందుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై ఉంది. ఫ్యాన్స్ సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నా కానీ ఎన్టీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు. రాజకీయాలకు సంబంధించి ఆలోచనలు కూడా లేకుండా ఉన్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఎన్టీఆర్ కు ఏముంటుందని కొంతమంది అయితే చెబుతున్నారు. ప్రస్తుతం సినీ కెరీర్ పై ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో దృష్టి ఉందని మరి కొందరు చెబుతున్నారు. ఎన్టీఆర్30 విషయంలో కొరటాల శివ పై ఉన్న భారం అంతా ఇంతా కాదు.  ఎన్టీఆర్ కు రాజకీయాలకు సంబంధించి కొన్ని ఆలోచనలు ఉన్నా కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఎన్టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటే మరో ఐదేళ్ల సమయం అయినా పడుతుందని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయటా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.ఈ ఏడాదే ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలుపెట్టాలని ఎన్టీఆర్ భావిస్తుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: