హీరో హీరోయిన్ ల కు కేవలం తమ వృత్తి పై  భావోద్వేగ భరితమైన అనుబంధం కూడా ఉంటుంది. ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు పనిచేయడం వల్ల యూనిట్‌ సభ్యులతో చక్కటి స్నేహ సంబంధాలు అయితే ఏర్పడతాయి.

షూటింగ్‌ మొత్తం పూర్తయి గుమ్మడికాయ కొట్టే రోజున మనసంతా కూడా భారమైపోతుంది. ఇన్నాళ్లు కలిసి పని చేసిన టీమ్‌ కు దూరమైపోతున్నామని వారు తెగ బాధపడతారు. హీరోయిన్ కీర్తి సురేష్‌ 'దసరా' సినిమా షూటింగ్‌ చివరి రోజు అలాంటి భావోద్వేగానికే గురైందని సమాచారం.అయితే షూటింగ్‌ చివరి రోజున యూనిట్‌ సభ్యులందరికి ఆమె బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి వారిపై తన మనసులో ని ప్రేమను చాటుకుందట  కీర్తి సురేష్‌. మొత్తం 130 మంది యూనిట్‌ సభ్యులకు గోల్డ్‌ కాయిన్స్‌ బహుమతిగా అందించి తన గొప్ప మనసును చాటుకుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్‌ కావడంతో కీర్తి సురేష్‌ మనసు బంగారం అంటూ ఆమె అభిమానులు బాగా ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా చాలా మంది హీరో హీరోయిన్ లు ఇదే తరహాలో యూనిట్‌ సభ్యులకు విలువైన బహుమతులు అందించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారని సమాచారం.కీర్తి సురేష్ తన అందం అభినయంతో అందరి మనసులు కూడా గెలుచుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి అప్పటి నుండి ఇప్పటిదాకా వరుస సినిమాలలో నటించి మెప్పించింది.మహానటి సావిత్రి బయో పిక్ లో నటించి అందరి మెప్పును సంపాదించు కుంది. నిజంగా సావిత్రి గారు చేశారేమో అని అనిపించింది. ఆ సినిమాతో కీర్తి కు తిరుగులేని పాపులరిటీ వచ్చింది. కానీ అభిమానులలో చిన్న అసంతృప్తి ఏంటంటే కీర్తి ఇది వరకు బొద్దుగా ముద్దుగా ఉండేది. కానీ ఉన్నట్టుండి సన్నబడి తన ఒరిజినల్ గ్లామర్ ను పోగొట్టుకుంది అని బాగా ఫీల్ అవుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: