ప్రస్తుతం తన మ్యూజిక్ తో ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకుంటున్న అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో మూవీ లకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ఎన్నో మూవీ ల విజయంలో కీలక పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ సినిమా అవకాశాలతో కెరీర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ యువ సంగీత దర్శకుడు కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించినప్పటికీ ఈ సినిమా లోని పాటలకు మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ సంగీత దర్శకుడు ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుండగా రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

 ఈ మూవీ నిన్న అనగా మార్చి 23 వ తేదీన పూజా కార్యక్రమాలతో అధికారికంగా లంచ్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మూవీ కి సంగీతం అందిస్తున్న అనిరుద్ రవిచంద్రన్ మాట్లాడుతూ ... కొరటాల శివ సార్ యొక్క గొప్ప విజన్ లో భాగమైనందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లెజెండ్స్ టీమ్ తో కలిసి పని చేసే అవకాశం ఇచ్చిన తారక్ కు ధన్యవాదాలు అని అనిరుద్ రవిచంద్రన్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: