తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి విజయాలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరో లలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ నటుడు దాస్ కా దమ్కి అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకు విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. మూడు రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 2.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 73 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

యు ఏ లో 64 లక్షలు , ఈస్ట్ లో 42 లక్షలు , వేస్ట్ లో 26 లక్షలు , గుంటూరు లో 49 లక్షలు ,  కృష్ణ లో 33 లక్షలు ,  నెల్లూరు లో 21 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 5.13 కోట్ల షేర్ ... 9.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు రోజుల్లో 76 లక్షల కలెక్షన్ వసూలు చేయగా , ఓవర్సీస్ లో 97 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 6.86 కోట్ల షేర్ ... 13.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.మరింత సమాచారం తెలుసుకోండి: