పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ విపరీతంగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలు ధియేటర్ లలో రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు కూడా ఇప్పటికే థియేటర్ లలో రీ రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులను సృష్టించాయి. కొంతకాలం క్రితమే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన జల్సా ... ఖుషి ... తొలి ప్రేమ సినిమాలు థియేటర్ లలో రీ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీ లకి ఒక ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన మరో మూవీ ని కూడా ధియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం గుడుంబా శంకర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వీర శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మీరా జాస్మిన్ ... పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఆ కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: