పండుగ సీజన్లో సినిమాలు విడుదల అయితే కచ్చితంగా గ్యారెంటీగా లాభాలను వస్తాయని నిర్మాతలు నమ్మకంతో విడుదల చేస్తూ ఉంటారు. కాస్త సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూకడుతూనే ఉంటారు. అందుకే దసరాకు రిలీజ్ అయ్యే సినిమాలు ఒక ప్రత్యేకత ఉంది.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన హీరోలు మళ్ళీ ఏడాది దసరాకు తమ సినిమాలతో అలరించడానికి వస్తున్నారు.. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద గిట్టు కొట్టాలని పట్టుదలతో తమ సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.

2021 వ సంవత్సరం లో సంక్రాంతి లో విడుదలైన సినిమాల విషయానికి వస్తే రవితేజ నటించిన క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.ఈ సినిమా హిట్టుగా నిలిచింది. మళ్లీ ఈ ఏడాది దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని అభిషేక గర్వాల్ నిర్మాతగా వ్యవహ రిస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.


ఇక సంక్రాంతికి వచ్చిన రామ్ పోతినేని రెడ్ చిత్రం ప్రేక్షకులను  మెప్పించలేకపోయింది. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈసారి దసరాకు రామ్ బోయపాటి శ్రీను కలిసి వస్తున్నారు ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీని విడుదల కాబోతున్నది.

ఇక గత సంవత్సరం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈసారి దసరాకు ఈ కాంబో మరొకసారి రిపీట్ కాబోతోంది ఆచిత్రమే లియో ఈ సినిమా కూడా భారీ బడ్జెట్లో ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

మరి ఏడాది సంక్రాంతికి వచ్చిన హీరోలు మళ్ళీ దసరాకి రావడానికి సిద్ధమవుతున్నారు మరి సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: