ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయ వంతమైన మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని ఫుల్ క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగిస్తున్న నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తాజాగా మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకొని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ కనెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లీక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: