టాప్ హీరోల సినిమాలకు ఘోరమైన ఫ్లాప్ లుగా మారినప్పటికీ వీకెండ్ ముగిసేసరికి కనీసం కొట్లలో డబల్ డిజిట్ కలక్షన్స్ అందుకుంటూ ఉంటాయి. భారీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఆసినిమాలను భారీ మొత్తాలకు కొన్న బయ్యర్లకు 50 శాతం వరకు నష్టాలు వచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అయితే గతవారం విడుదలైన ‘శాకుంతలం’ అత్యంత భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో కనీసం ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లకు 30 శాతం రికవరీ వస్తే చాల అదృష్టం అన్న మాటలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.


సాధారణంగా ఒక మంచి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం విమర్శకుల ప్రశంసలు అయినా దక్కుతూ ఉంటాయి. ఈవిషయంలో కూడ ఈ మూవీకి ఎదురుదెబ్బ తగిలింది. మంచి సినిమాలను ప్రోత్సహించే విమర్శకులు కూడ ‘శాకుంతలం’ మూవీని చూసి తట్టుకోలేకపోయారు. దీనితో వరస సెలవులు వచ్చిన వీకెండ్ లో కూడ ఈ మూవీని చూడటానికి ఎవరూ సాహసించలేకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


ఈ మూవీని దర్శకత్వం వహించిన గుణశేఖర్ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలు లాంటి ఎందుకు తీయలేకపోయాను అంటూ జలసీ ఫీల్ అయ్యాను అంటూ యధాలాపంగా అన్నాడు. అయితే ఇప్పుడు ఆమాటలే అతడి పై నెగిటివ్ కామెంట్స్ దాడికి ఆస్కారం కలిగించాయి. జలసీతో గుణశేఖర్ కోట్లు పోగొట్టుకున్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో జోక్ చేస్తున్నారు.


సాధారణంగా సినిమాల స్క్రిప్ట్ విషయంలో మేకింగ్ విషయంలో చాల ఖచ్చితంగా వ్యవహరించే దిల్ రాజ్ ఈ మూవీ పై ఎందుకు అంచనాలు వేయలేకపోయాడు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మహాభారతంలో కర్ణుడి మరణానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ‘శాకుంతలం’ ఘోర పరాజయానికి అన్ని కారణాలు ఉన్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ కష్టాలను గట్టేకించవలసిన ఓటీటీ ఛానల్స్ యాజమాన్యాలు కూడ ‘శాకుంతలం’ రైట్స్ విషయంలో భారీగా కోత విధించే ఆస్కారం ఉంది అన్న అంచనాలు కూడ ఉన్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: