తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ ని అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు  భాషతో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి ట్రైలర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయనుంది.

మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మాస్ కోసం స్పెషల్ గా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఒక సాంగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఈ సినిమాలో హైలెట్ గా నిలబబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బీన్స్ ఈ మధ్య కాలంలో సంగీతం అందించినటువంటి ధమాకా మరియు బలగం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ... ఈ మూవీ ల మ్యూజిక్ కి కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకులం నుండి అద్భుతమైన ప్రశంసలు ఈ సంగీత దర్శకుడు కి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: