బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీ బిజీ గా గడుపుతోంది. ప్రస్తుతం సుమ వరుస సినిమా ఈవెంట్స్ అంటూ సక్సెస్ మీట్స్ కార్యక్రమాలు అంటూ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు అంటూ చాలా బిజీ బిజీగా గడుపుతుంది. ఇండస్ట్రీలో సుమకి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద హీరోల సినిమాల నుండి మొదలు పెడితే మొన్న మొన్న వచ్చిన హీరోల సినిమాల వరకు ఏ కార్యక్రమం జరిగిన తప్పనిసరిగా శ్రమ ఉంటుంది.

ఇందులో భాగంగానే చాలామంది సుమా డేట్స్ దొరకవేమో అన్న భయంతో ముందుగానే డేట్ లను బుక్ చేసుకుంటున్నారు. సుమని తమ కార్యక్రమాలకు ఈ యాంకర్ గా తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇలా ఇండస్ట్రీలో క్రేజీ యాంకర్ గా దూసుకుపోతోంది సుమా. ఇందులో భాగంగానే సుమా రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటుంది .ఒకప్పుడు ఏ సినిమా ప్రే రిలీజ్ ఈవెంట్ కి అయినా సరే లక్ష నుండి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ ప్రస్తుతం ఏకంగా ఆ రెమ్యూనరేషన్ డబుల్ చేసిందట సుమ. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కి గాను మూడు నుండి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

 అయితే ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈమె అడిగిన భారీ రెమ్యూనరేషన్ను కూడా ఇస్తామని తమ సినిమా ఈవెంట్లకు యాంకర్ గా సుమని నియమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలను పూర్తిగా తగ్గించేసింది సుమ. సినిమా ఈవెంట్లతో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. వాటితోపాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూడా అందరిని సందడి చేస్తోంది .దీంతో సుమ ఒక్కో సినిమా ఈవెంట్ కి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: