మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నువ్వొస్తానంటే నేనొద్దంటానా , వర్షం , అతడు , పౌర్ణమి , బుజ్జిగాడు , స్టాలిన్ , కృష్ణ , కింగ్ , ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే , నమో వెంకటేశ , బాడీగార్డ్ వంటి హిట్ సినిమా లతో పాటు అనేక సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ సినిమాలు నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా వరుసగా తమిళ సినిమా లలో నటిస్తూ ఇప్పటికి కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే త్రిష తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా మూవీ లో కీలక పాత్రలో నటించింది.

 ప్రస్తుతం తలపతి విజయ్ హీరో గా రూపొందుతున్న లియో మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ  మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా త్రిష అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న రంగు రంగుల డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: