పోయిన సంవత్సరం విడుదల అయినటు వంటి రౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి యువ హీరో ఆశిష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఆశిష్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాకపోతే ఈ మూవీ ద్వారా ఆశిష్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే రౌడీ బాయ్స్ మూవీ తర్వాత ఆశిష్ "సెల్ఫిష్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... లవ్ టు డే ఫేమ్ ఇవాన ఈ సినిమాలో ఆశిష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి "దిల్ కుష్" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ మే 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లోని దిల్ కుష్ అంటూ సాగే పాట విడుదలకు సంబంధించిన సమయాన్ని ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా ఈ ప్రోమో సాంగ్ కు  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: