వ్యాపారం అంటేనే లెక్కలతో కూడి ఉంటుంది. గ్లామర్ బిజినెస్ గా పేరుగాంచిన సినిమా నిర్మాణంలో లెక్కలు తలలు పండిన వారికి కూడ అంతుచిక్కవు. ఒక సినిమాను ప్రారంభించేముందు అనుకున్న బడ్జెట్ కు ఆసినిమా పూర్తి అయ్యే సమయానికి అయ్యే ఖర్చుకు ఎక్కడా పొంతన ఉండదు. ఈ లెక్కల విషయంలో ఏచిన్న పొరపాటు జరిగినా నిర్మాతలు భారీగా నష్టపోతూ ఉంటారు.


లేటెస్ట్ గా దర్శకులు నిర్మాణ భాగస్వాములుగా మారి తీసిన సినిమాలు చాలమటుకు ఫెయిల్ అవుతూ ఉండటంతో దర్శకులు ఎంత గొప్పవారు అయినప్పటికీ నిర్మాతలుగా సక్సస్ కాలేరా అన్నచర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. గత సంవత్సరం భారీ అంచనాలతో విడుదలైన ‘ఆచార్య’ ‘లైగర్’ సినిమాలకు ఎన్నో బ్లాక్ బష్టర్ హిట్ లు అందించిన కొరటాల శివ పూరీ జగన్నాథ్ లు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు.


ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించడంలో తప్పటడుగులు వేయడంతో ఆ రెండు సినిమాలు గత సంవత్సరం విడుదలైన భారీ ఫ్లాప్ ల లిస్టులో చేరిపోయాయి. పూరీ కొరటాల శివ లు ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక లేటెస్ట్ గా విడుదలై భారీ ఫ్లాప్ గా మారిన ‘ఏజెంట్’ మూవీకి సురేంద్ర రెడ్డి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. అతడు కూడ రెండు భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఫెయిల్ అయినట్లు అనిపిస్తోంది.

ఈమధ్యనే విడుదలైన ‘శాకుంతలం’ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం నిర్మాణ బాధ్యతలు నిర్వహించాడు. అతడు కూడ ఈ రెండు బాధ్యతలలోను ఫెయిల్ అయ్యాడు. దీనితో లెక్కలు వేయడంలో టాప్ దర్శకులు తప్పటడుగులు వేస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సుకుమార్ పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ కు సుకుమార్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో సుకుమార్ ‘పుష్ప 2’ విషయంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: