తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయా లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరి గా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల్లో నటించడం చాలా వరకు తగ్గించింది. 

ఎక్కువ శాతం తమిళ సినిమా లలో నటిస్తోంది. అందులో భాగంగా తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష నటించింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తలపతి విజయ్ హీరో గా రూపొందుతున్న లియో అనే మూవీ లో త్రిష విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కనుక భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించినట్లు అయితే త్రిష క్రేజ్ మళ్లీ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. గత కొంత కాలం నుండి త్రిష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో త్రిష పింక్ కలర్ లో ఉన్న శారీ  ని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: