తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే చైతు తాజాగా వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ప్రియమణిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

 అరవింద స్వామి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ భాషల్లో మే 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ హీరో అయినటు వంటి చైతు వరస ఇంటర్వ్యూ లలో ... వరుస టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ యువ హీరో ఎన్టీఆర్ ... అల్లు అర్జున్ ... ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చైతు మాట్లాడుతూ ... ఎన్టీఆర్ నా దృష్టిలో ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్. అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్ చేసిన దానికి స్టైల్ ను జోడిస్తాడు. ప్రభాస్ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చైతు ఎన్టీఆర్ ... అల్లు అర్జున్ ... ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కస్టడీ మూవీ ట్రైలర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: