మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ లీల "పెళ్లి సందD" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. దానితో మొదటి మూవీ తోనే శ్రీ లీల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం చివరన విడుదల అయిన ధమాకా మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. శ్రీ లీల ప్రస్తుతం రామ్ ... బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లోను , మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లోను , పవన్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోనూ , నితిన్ ... వక్కంతం వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లోను , విజయ్ దేవరకొండ ... గౌతమ్  తిన్ననురి కాంబినేషన్ లో పొందుతున్న మూవీ లోను మరియు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తుంది.

ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: