తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా తనకంటూ ఒక అదిరిపోయే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన భద్ర మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన బోయపాటి ఆ తరువాత తులసి , సింహ , దమ్ము  , సరైనోడు , లెజెండ్ , జయ జానకి నాయక , వినయ విధేయ రామ , అఖండ మూవీ లకు దర్శకత్వం వహించి ఇందులో ఎక్కువ మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరో గా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ "బోయపాటి రాపో"  అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే భాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క టీజర్ మే 15  వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: