పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ  పై భారీ అంచనాలు నెలకొన్నాయి

బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓంరౌత్ తెరకెక్కించిన ఈ కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మొదటిసారి రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండడంతో ఆదిపురుష్ పై మరింత హైప్ కూడా క్రియేట్ అయ్యింది. అయితే టీజర్ విషయంలో అనేక విమర్శలు వచ్చినప్పటికీ.. ట్రైలర్‏తో వాటన్నింటికీ గట్టిగానే కౌంటరిచ్చిందట చిత్ర యూనిట్. వీఎఫ్ఎక్స్ మార్పుల అనంతరం విడుదల అయిన ట్రైలర్ ఏరెంజ్‏లో ఉండబోతుందోకూడా తెలియజేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండంతో ఇప్పటికే ఈ ప్రమోషన్స్ షూరు చేసిందట చిత్రయూనిట్. ఓవైపు ఇటీవల విడుదలైన సీతమ్మ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా… తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీం.

తాజాగా విడుదలైన పోస్టర్ లో హనుమంతుడిపై రాముడు నిల్చోని విల్లు సంధిస్తున్నాడని తెలుస్తుంది.ఈ పోస్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఇందు లో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్ర లో.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారట.ఇప్పటి కే విడుదలైన ట్రైలర్ తో మంచి విజువల్ ఎఫెక్ట్స్ కూడా అందించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తుంది.ప్రతి దృశ్యంకూడా కన్నుల పండుగ గా ఉంటుంది.

ఈ చిత్రాన్ని జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విడుదల చేయనున్నారని తెలుస్తుంది.ఓవైపు ఈ ప్రమోషన్స్ జరుగుతుండగా.. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల షూటింగ్ లతో బాగా బిజీగా ఉన్నారు ప్రభాస్.ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు ఈ ఏడాది సలార్ అనే సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28 న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: