కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ నార్త్ రెండు చోట్లా బిజీ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. అయితే బాలీవుడ్ లో రిలీజైన రెండు సినిమాలు తను ఊహించినట్టుగా ఫలితాలు ఇవ్వలేదు. అయితే రష్మిక చేస్తున్న ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నరు. సౌత్ ని పూర్తిగా వదిలి అమ్మడు ఎక్కడ నార్త్ లో సెటిల్ అవుతుందో అని వారు కంగారు పడుతున్నారు. కానీ రష్మిక మందన్న మాత్రం సౌత్ సినిమాలతో పాటుగా నార్త్ ఆడియన్స్ ని కూడా వరుస సినిమాలతో మెప్పించడానికి రెడీ అవుతుంది.

అందుకే ఒకటి ఇక్కడ రెండు అక్కడ అనే ఫార్ములా ఫాలో అవబోతుంది. రష్మిక మందన్న ప్లాన్ వర్క్ అవుట్ అయితే కచ్చితంగా ఆమె నెమర్ 1 ప్లేస్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో అమ్మడు స్టార్ క్రేజ్ తెచ్చుకోగా ఈమధ్య ఇక్కడ సినిమాలకు కొంత గ్యాప్ రాగా ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది అమ్మడు. ఇప్పటికే నితిన్ తో భీష్మ సినిమా కాంబో రిపీట్ చేస్తూ వర్క్ అవుట్ చేయబోతుంది అమ్మడు.

ఇదేకాకుండా మరో రెండు భారీ సినిమాలు చేయబోతుందని తెలుస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో రష్మిక తన సత్తా చాటబోతుందని అర్ధమవుతుంది. రష్మిక చేస్తున్న ఈ సినిమాలతో మిగతా హీరోయిన్స్ అంతా అవాక్కవుతారని చెప్పొచ్చు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కూడా రష్మిక సినిమా ఉండబోతుందని టాక్. వీరిద్దరు కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి రష్మిక మందన్న నెక్స్ట్ టార్గెట్ టాప్ చెయిర్ కాగా అమ్మడు ఎలా దాన్ని సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మిగతా హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా రష్మిక కావాలని కోరుకుంటున్న స్టార్స్ ఉన్నారు కాబట్టి రష్మిక ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: