దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది హన్సిక .ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ నటించింది ఈమె. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక తన లేలేత అందాలతో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈమెకి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్లో సైతం స్టార్ హీరోయిన్గా ఒక మంచి పేరు వచ్చింది. అయితే ఇటీవల ఈమె వివాహం చేసుకొని తన మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా తనతో కలిసి నటించిన పలువురు నటీనటుల గురించి పరి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

తన ఫస్ట్ హీరో అల్లు అర్జున్ పైన అయితే పొగడ్తల వర్షం కురిపించింది హన్సిక. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అని.. ఆయన చాలా స్వీట్ పర్సన్ అని.. అల్లు అర్జున్ తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేసింది. హన్సిక అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి హన్సిక మాట్లాడుతూ.. సమంత ఒక వారియర్ అని.. సమంత చాలా స్ట్రాంగ్ పర్సన్.. అని తెలిపింది హన్సిక. అనంతరం దక్షిణాది నటీనటుల పైన ఉత్తరాది వారు కాస్త వివక్ష చూపిస్తూ ఉంటారు. నార్త్ కు చెందిన కొంతమంది డిజైనర్లు తమ దుస్తులను డిజైన్ చేయించడానికి ఆసక్తి చూపించారని తెలిపింది హన్సిక.

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు గుర్తింపు వస్తున్నప్పటికీ అందరిని సమానంగా చూడాలి కానీ అలా జరగడం లేదు.. అంటూ తెలిపింది హన్సిక. అన్ని ప్రాంతీయ నటించిన సమానంగా చూడడం చాలా అవసరం.. అది మన అందరిలోనూ ఉండాలి ..అంటూ తెలియజేసిందే హన్సిక. ప్రస్తుతం హన్సిక చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక అలా హన్సిక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించడంతో వారి అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: