
ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రత్యేకంగా వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లు కూడా ఉన్నారు అని చెప్పాలి. కానీ ఇప్పటివరకు వారి ఫోటోలు బయటపడలేదు. అయితే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని విడిపోతారని.. అనుష్కకి రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లి బంధం అంతాగా బాగుండదని వేణు స్వామి చెప్పాడు. నయనతార పెళ్లి తర్వాత కూడా చిక్కుల్లో పడుతుందని విడాకుల వరకు వెళతారు అంటూ వేణు స్వామి తెలిపాడు. రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని చెప్పాడు.
ఇక ఇప్పుడు వరకు సినీ సెలబ్రిటీల గురించి ఈయన చెప్పిన వాటిలో దాదాపు చాలానే నిజం అయ్యాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక యాంకర్ జాతకాన్ని చెప్పాడు వేణు స్వామి. ఆ యాంకర్ ఎవరో కాదు వర్షిని. వర్షిని అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు వరకు పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసింది వర్షిని. అయితే ఈ మధ్యకాలంలో వర్షిని గురించి ఒక వార్త గట్టిగా వినిపిస్తుంది. యాంకర్ వర్షిని క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ప్రేమలో పడిందని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వర్షిని క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటున్నట్టు వేణు స్వామి జాతకం చెప్పారు. ఇక ఇప్పుడు అలాంటి వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మాత్రం వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ గా మారబోతున్నాడు అని చెప్పాలి.