రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందD.ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయ మయ్యారు కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల.

మొదటి సినిమా తోనే తన అందం అభినయం నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నటు వంటి ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం శ్రీ లీల అరడజనుకు పైగా సినిమా అవకాశాలను చేతి లో పెట్టుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీ గా ఉన్నారు.
ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని అందుకున్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమా అవకాశాలను కూడా అందుకొని బిజీ గా ఉన్నారు.

ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ల లో ఎంతో బిజీ గా ఉన్నటు వంటి శ్రీలీల సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు థియేటర్లకు టికెట్లు కొనుక్కొని వస్తున్నారు అంటే అది కేవలం హీరోలను చూసి మాత్రమేన ని హీరోల కోసమే పెద్ద ఎత్తున టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.ఇక తాను ఇండస్ట్రీ కి కొత్త గా వచ్చానని ఇండస్ట్రీ లో తనకు మంచి పాత్రలు ఉన్న సినిమా అవకాశాలు వస్తే చాలు.అలా కాకుండా సినిమా మొత్తం తానే కనిపించాలని కోరుకోను అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు.

ఇలా హీరోల కోసమే టికెట్లు కొనుక్కొని సినిమాలకు వస్తున్నారంటూ శ్రీ లీల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె ధమాకా సినిమా విజయం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేశారని అర్థమవుతుంది.ధమాకా సినిమాలో శ్రీ లీల పెద్ద ఎత్తున ప్రేక్షకుల ను ఆకట్టుకొని ఈ సినిమా సక్సెస్ కు ఈమె కారణమైం దంటూ వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: