మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హీరోగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే బ్యానర్ను స్థాపించాడు రామ్ చరణ్. ఈ బ్యానర్ను స్థాపించి తన తండ్రి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా మరొక పక్క స్నేహితుడు యు వి క్రియేషన్స్ సంస్థ పార్ట్నర్స్ లో 

ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి v మెగా పిక్చర్స్ అని సంస్థను కూడా స్థాపించాడు. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడమే తన ప్రధాన ఉద్దేశంతో ఈ బ్యానర్ను స్థాపించాడు రామ్ చరణ్ .అంతేకాకుండా ఈ బ్యానర్ పై మిడ్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే మొదటి సినిమాని అఖిల్ తో ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్ .రామ్ చరణ్ కి అఖిల్ అంటే చాలా ఇష్టమనే సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అఖిల్ కూడా రామ్ చరణ్ ని పెద్దన్న అని పిలుస్తూ ఉంటాడు. ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే హలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అంతే కాదు హలో సినిమాకి దగ్గరుండి ప్రమోషన్స్ కూడా చేశాడు రామ్ చరణ్. ఒక్క సినిమాని కాకుండా ఏజెంట్ సినిమా విషయంలో కూడా తన వంతు సహాయం అందించాడు రామ్ చరణ్. ధ్రువగా ఏజెంట్ సినిమాను ప్రమోట్ చేశాడు రామ్ చరణ్ .ఇప్పుడు అఖిల్ తో మంచి పాన్ ఇండియా సినిమా చేయాలి అన్న ప్లాన్లో ఉన్నాడట రామ్ చరణ్. v మెగా పిక్చర్స్ లో ఆల్రెడీ ప్రయత్నాలు కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగానే జరిగితే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేస్తారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: