సమంత.. టాలీవుడ్ లో ఈమెని కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ జనాలు సమంతని బతిమాలి మరి అవకాశాలు ఇస్తున్నారు అని తెలుస్తుంది.. అలాంటి సమంత గురించి సోషల్ మీడియాలో షాకింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే సమంతహాలీవుడ్ హీరో తో ప్రేమలో మునిగితేలుతుంది అంటూ నెట్టింట్లో ఒక వార్త వైరల్ అవుతుంది.మరి ఇంతకీ సమంత ప్రేమలో పడ్డ ఆ హాలీవుడ్ హీరో గురించి తెలుసుకుందాం.

సమంత ని టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది విమర్శిస్తున్నప్పటికీ వారి విమర్శలు అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన దారి తనది అన్నట్లు చూసుకుంటూ వెళుతుంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఎలాంటి బాధపడకుండా తన నెక్స్ట్ సినిమా ఖుషి పై తన దృష్టి మొత్తం పెట్టింది.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా చేస్తోంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా సమంత గురించి మరొక వార్త సోషల్ మీడియాలో జోరుగా అయితే వినిపిస్తోంది.

అదేంటంటే సమంత హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. సమంత ఇప్పటికే హాలీవుడ్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరో హాలీవుడ్ మూవీ కి కూడా ఓకే చేసి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేద్దామని కూడా భావిస్తుందట.అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బయటపడడంతో చాలామంది నెటిజన్స్ ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

హాలీవుడ్ డైరెక్టర్ జాన్ ఫిలిం దర్శకత్వం వహిస్తున్న చెన్నై స్టోరీ అనే సినిమాలో నటుడు వివేక్ కల్రా సరసన సమంత హీరోయిన్గా నటిస్తుందని సమాచారం.ఇక ఈ సినిమా ప్రేమ కథ చిత్రం అని,ఇందులో వివేక్ కల్రా తో కలిసి సమంత ప్రేమలో మునిగి తేలబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: