రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకోని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎంఎం కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన బాహుబలి 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నయనతార , తమన్నా హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 116 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: