నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని దసరా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఈ దర్శకుడు తన కెరియర్ ను దర్శకుడిగా ప్రారంభించాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. ఈ సినిమా ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా దసరా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నాని ప్రస్తుతం తన కెరీర్ లో 30 వ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ ని దర్శకుడు ఎమోషనల్ డ్రామాగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ అనుకున్న దానికంటే ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ షూటింగ్ అనుకున్న దాని కంటే ఒక నెల ముందుగానే కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బడ్జెట్ కూడా మూవీ బృందం వేసుకున్న దాని కంటే తక్కువలోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ షూటింగ్ అనుకున్న దాని కంటే ముందే పూర్తి అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ లకు చాలా సమయం దొరికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: