ఈమధ్య దుబాయ్ కి తన స్నేహితులతో కలిసి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ తన ట్రిప్ ను ముగించుకుని భాగ్యనగరం తిరిగి వచ్చిన వెంటనే తాను నటిస్తున్న ‘దేవర’ మూవీ షూటింగ్ స్పాట్ లోకి జాయిన్ అయిపోయాడు. ఈసినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానున్న మూవీకి రెడీ కాబోతున్నాడు.


ఆమూవీ చేస్తూనే హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇలా వరసపెట్టి సినిమాలు చేస్తూనే జూనియర్ తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. జూనియర్ స్థాపించబోయే ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొన్ని చిన్నసినిమాలను తీసి విడుదల చేయాలనే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేకమంది టాలెంటెడ్ హీరోలు దర్శకులు ఉన్న పరిస్థితులలో ఆ టాలెంట్ ను ఉపయోగించుకుని మంచి చిన్న సినిమాలు తీయాలని తారక్ ఆలోచన అని అంటున్నారు. వాస్తవానికి జూనియర్ కు ఇలాంటి ఆలోచనలు రావడానికి రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ప్రభావితం చేసి ఉంటుంది అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్యనే రామ్ చరణ్ యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి వి మెగా పిక్చర్స్ అన్న నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే.


ఆ సంస్థ తరఫున చరణ్ సంవత్సరానికి రెండు మూడు చిన్న సినిమాలు తీసే ఆలోచనలు చేస్తూ అనేకమంది యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న కథలను వింటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే మార్గాన్ని జూనియర్ కూడ అనుసరిస్తూ చిన్న సినిమాల నిర్మాణానికి ప్రొడక్షన్ హౌస్ ను స్థాపిస్తున్నాడు అనుకోవాలి. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెపుతున్నారు. ఇప్పుడు అదే జరిగితే జూనియర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని కనీసం విజ్ఞాపన అయినా ఇస్తాడా అన్నది సమాధానంలేని ప్రశ్న..  






మరింత సమాచారం తెలుసుకోండి: