కరోనా సమస్యల మధ్య కొన్ని వ్యాపార సంస్థలు మూతపడుతు ఉంటే మరికొన్ని కొత్తకొత్త వ్యాపారాలు కొత్తకొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం కరోనా పేరు చెపితే జనం ఉలిక్కి పడుతున్న పరిస్థితులలో బ్యాక్టీరియాను దరిచేరనివ్వని వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం టివిలో ప్రకటనలు ఇచ్చే అన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఉత్పత్తి దారులు తమ ప్రోడక్ట్ ను ఉపయోగిస్తే చాలు వైరల్ బ్యాక్టీరియా మనఇంటిలో ఉండదని ధైర్యాన్ని ఇస్తూ ఈసమయంలో కూడ తమ సేల్స్ పెంచుకోవడానికి అనేక కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు.


ప్రస్తుతం జనం నిత్యావసర వస్తువులు మందులు ఆహార పదార్థాలు కొనడం పై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్న విషయం తెలిసిందే. దీనితో పెద్దపెద్ద వస్త్ర దుకాణాల నుండి చిన్నచిన్న వస్త్ర దుకాణాలు అన్నీ వెలవెల పోతూ సేల్స్ లేక సమస్యలను ఎదుర్కుంటున్నాయి.




ఇలాంటి పరిస్థితులలో వైరస్ లు బ్యాక్టీరియాలు దరిచేరనివ్వని యాంటీ వైరల్ యార్న్ తో తయారు చేసిన వస్త్రాలను మార్కెట్ లోకి ఒకప్రముఖ వ్యాపారసంస్థ ప్రవేశపెడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈపరిశ్రమకు సింతటిక్ యార్న్ తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రజల దృష్టి అంతా వైరస్ లు చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఆవిషయాన్ని కనిపెట్టి అనేక పరిశోధనలు చేసి తయారుచేసిన యార్న్ తో ఈనూలు వస్త్రాలు తయారు చేసామని ఈసంస్థ నిర్వాహకులు చెపుతున్నారు.


ఇప్పటికే ఇలాంటి పరిశ్రమలు తమిళనాడులో బాగా సక్సస్ అయిన నేపధ్యంలో ఇలాంటి కరోనా దరిచేరని నూలు తయారీకి ఒక యువ పారిశ్రామికవేత్త సన్నాహాలు చేస్తున్నాడు. 70 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో నెలకొల్ప బడుతున్న ఈయూనిట్ సక్సస్ అయితే ఈరంగంలోకి మరింతమంది యువ పారిశ్రామిక వేత్తలు వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో అనేక ప్రముఖ కంపెనీలు ఋణ రహిత కంపెనీలుగా తమకు తాము ప్రకటించుకుంటు వాటా దారుల నమ్మకాన్ని పొందుతున్న పరిస్థితులలో కొత్తగా ఏర్పాటు అవుతున్న ఈ యాంటీవైరల్ యార్న్ కంపెనీ కూడ ఋణ రహిత కంపెనీ అని అంటున్నారు. దీనితో రానున్న రోజులలో ఇక జనం వేసుకునే బట్టలు అన్నీ యాంటీ వైరల్ యార్న్ తో తయారు చేసిన రకరకాల డిజైన్స్ తో గార్మెంట్స్ రాబోతు ఈరంగంలో అనేకమందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: