సీఎం మోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే నిన్న అనగా జూలై 27 వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఆగస్టు 16వ తేదీన విద్యా కానుక పథకాన్ని అమలు చేయాలని, అలాగే ఆగస్టు 10వ తేదీన నేతన్న నేస్తం పథకాలను అమలు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అంతేకాదు అగ్రిగోల్డ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి, నష్టపోయిన బాధితులకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి ఒక తీపి కబురు తీసుకొచ్చారు. అదేమిటంటే 20 వేల రూపాయల కంటే తక్కువ మొత్తంలో అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన వారికి, ఆగస్ట్  24వ తేదీన వారి ఖాతాలో జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.ఇక వీరితో పాటు స్పిన్నింగ్ మిల్స్, MSME వారికి కూడా ఆగస్టు 27వ తేదీన వారికి రావలసిన ఇంటెన్సివ్ లను కూడా ఇస్తామని జగన్ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.ఇక ఈ కాన్ఫరెన్స్ లో భాగంగానే గ్రామస్థాయిలో ఎవరైతే పనిచేయకుండా కాలక్షేపం చేస్తున్నారో అలాంటి అధికారులకు , షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు గ్రామ , వార్డ్ సచివాలయలను సందర్శించాలని , అందులో ఉన్న లోపాలను కనిపెట్టి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లాలని, సీఎం జగన్ ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయలను కలెక్టర్లు ,మున్సిపల్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ఇలా వీరంతా ఇన్ఫెక్షన్ చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ.. వార్డు సచివాలయలను వారానికి రెండు సార్లు కలెక్టర్లు తనిఖీ చేయాలని సీఎం జగన్ కోరాడు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన అందరికి పిలుపు నిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: