కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో పనిచేస్తున్న వారికి పదవి విరమణ తర్వాత తీసుకునే పెన్షన్  రూపంలో సడలింపులు జరపడం జరిగింది. ఇక పింఛన్లు అందించే పెన్షనర్ వెల్ఫేర్ శాఖ సరికొత్తగా 75 అతి ముఖ్యమైన కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ..వారు మరణానంతరం, వారి ఇద్దరి పెన్షన్లు కుటుంబ సభ్యులకు చెందడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు గరిష్టంగా 45,000 ఉన్న పెన్షన్లను ఇప్పుడు రూ.1.25 వేలకు  పెంచినట్లు సమాచారం.


ఉదాహరణకు ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయి వుండి,  వారిద్దరూ మరణిస్తే, గరిష్టంగా వారి కొడుకుకు లేదా కుమార్తెకు ఇప్పటివరకు కేవలం 45 వేల రూపాయలు మాత్రమే గరిష్టంగా ఇవ్వడం జరిగింది. ఇకపోతే పెన్షనర్ వెల్ఫేర్ శాఖ తీసుకువచ్చిన 75 సరికొత్త రూల్స్ ను దృష్టిలో పెట్టుకొని, ఈ మొత్తాన్ని ఒక లక్షా 25 వేల రూపాయల వరకు పెంచినట్లు  సమాచారం. పెన్షన్ తీసుకునే వృద్ధుల్లో అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే వెల్ఫేర్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


పెన్షనర్ వెల్ఫేర్ శాఖ తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చేత పెన్షన్ కుటుంబానికి రూ.1.25 లక్షలు లభించడంతో పాటు అదనంగా డీఆర్ కూడా జత చేయడం జరుగుతుంది. అంటే నెలకు తొమ్మిది వేల రూపాయలను కనిష్టంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే, ఆ కుటుంబానికి నెలకు గరిష్టంగా రూ. 27 వేల నుంచి రూ.45 వేల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఏడవ వేతన సంఘం ఉద్యోగులకు గరిష్టంగా రూ.12,500 ఇచ్చేవారు. కానీ పరిమితిని పెంపొందిస్తూ దానిని గరిష్ఠంగా రూ.75,000 కి పొడిగించారు. అయితే ఒక్కొక్కరికి మాత్రమే ఇంత ఇవ్వడం జరుగుతుంది. అదే భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయి,  తర్వాత మరణిస్తే, వారి కుమార్తెకు లేదా కుమారుడికి నెలకు రూ .1.50 వేలు పెన్షన్ కింద లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: