ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడం సులభం అని ఆలోచిస్తున్నారు . అయితే ఉద్యోగం చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని అలాగే వ్యాపారం అయినా సరే పెట్టుబడి లేని వ్యాపారం మొదలు పెట్టలేరు. అయితే ముందుగా కొంత వరకు డబ్బు ఇన్వెష్ట్ చేస్తేనే మనం తిరిగి డబ్బులను పొందడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని బిజినెస్ ఐడియాస్ ఏమంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు వేల రూపాయలు డబ్బులు సంపాదించవచ్చు.. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పే కొన్ని ఐడియాస్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి.

సోషల్ మార్కెటింగ్:
ఉదాహరణకు ఇంస్టాగ్రామ్ లో మీరు ఫాలోవర్స్ ను  పెంచుకుని కొన్ని కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల ఆ కంపెనీ మీకు కొంత వరకు షేర్ ను ఇస్తుంది. ప్రొడక్ట్  ను బట్టి అందుకు తగిన డిమాండ్ ను బట్టి కూడా మీరు కంపెనీ వాళ్లతో డీల్ కుదుర్చుకోవచ్చు. ఇక ఇందుకోసం మీరు రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫాలోవర్స్ పెంచుకోవడమే.. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది ఒక మంచి బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు.


యూట్యూబ్ ఛానల్:
ఇందులో మీరు రూపాయి కూడా పెట్టుబడి కింద పెట్టాల్సిన అవసరం లేదు.. కాబట్టి మీ ప్రతిభతో కొన్ని వీడియోస్ చేసి వాటిని యూట్యూబ్ ఛానల్ లో పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకంటూ ఒక ఛానెల్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మంచి డియోస్ ని పెట్టి ఫాలోవర్స్ పెంచుకుంటే గూగుల్ వాళ్ళు మీ వీడియోలకు యాడ్స్ వేసుకుంటారు.. తద్వారా కూడా యాడ్స్ కి కొంత డబ్బు చొప్పున మీకు డబ్బు రావడం జరుగుతుంది.


కాబట్టి ప్రస్తుతానికి ఈ రెండింటిలో మీకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకుని పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండి.. ఇక మిగతా బెస్ట్ ఐడియాస్ కోసం వచ్చే సంచికలో చూడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: