ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వామివారి స్ఫూర్తిని స్మరించుకుంటూ మనసును తాకేలా ప్రసంగించారు. “ప్రజలను జడ్జ్ చేయకూడదు, వారిని అర్థం చేసుకోవాలి అన్న సందేశాన్ని సత్యసాయి బాబా ఎల్లప్పుడూ ముందుకు పెట్టేవారు. ఆ ఆలోచనలను మన రోజువారీ జీవితంలో అమలు చేస్తే అనేక సమస్యలు సహజంగానే తగ్గిపోతాయి’’ అని ఆయన తెలిపారు. అలాగే, సత్యసాయి బాబా సేవాభావాన్ని గుర్తుచేసుకుంటూ సచిన్ .. “ప్రజలకు సేవచేయడమే స్వామివారి నిజమైన లక్ష్యం. శారీరక ఆరోగ్యం మాదిరిగానే మానసిక ఆరోగ్యం కూడా ఎంత ముఖ్యమో ఆయన ఎప్పుడూ చెప్పేవారు. బలహీన వర్గాలకు సాయం చేయడమే నిజమైన విజయమని స్వామివారి దగ్గరకు వెళ్లిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు" అని అన్నారు.
2011 వరల్డ్‌కప్ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ సచిన్ ..“ఆ సమయంలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉండేవి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు స్వామి ఫోన్ చేసి ఆశీర్వదించారు. అనంతరం ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం నాకు సానుకూల దృక్పథాన్ని, అపారమైన స్ఫూర్తిని ఇచ్చింది. ఆ శక్తిస్థాయే మా జట్టును ఆ వరల్డ్‌కప్ గెలిచేలా నడిపింది. అది నా జీవితంలోని గోల్డెన్ మూమెంట్" అని టెండూల్కర్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. పుట్టపర్తి శతజయంతి ఉత్సవాలు ఇంకా కొన్ని రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి