పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ సందడి నెలకొంది. సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని ప్రశాంత నిలయానికి చేరుకున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, అక్కడ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. . పుట్టపర్తిలో జరుగుతున్న శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేద మంత్రాలు, సాయి నామస్మరణతో ప్రశాంత నిలయం భక్తి వాతావరణంతో నిండిపోయింది. .


ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా జీవితం, తాత్విక బోధనలు, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం మరియు నలుగు ప్రత్యేక తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, సత్యసాయి బాబా చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మానవతా మార్గం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, భక్తులు—ప్రతీ ఒక్కరూ సత్యసాయి బాబాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “మానవ సేవే మాధవ సేవ’’ అన్న సత్యసా
యి బోధన కోట్లాది మందికి స్పూర్తినిచ్చిందని, ఆయన దేశవ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. .


పుట్టపర్తి సందర్శన అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరుతున్నారు. అక్కడ దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం–2025ను ప్రారంభించనున్నారు. ఈ వేదికపై దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,000 కోట్లకు పైగా నిధులను పీఎం-కిసాన్ 21వ విడత కింద విడుదల చేయనున్నారు. తరువాత ఈ సమావేశంలో కూడా ప్రధాని ప్రసంగించనున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: