డబ్బు అనేది నేటి రోజుల్లో ఎంత విలువైనది అన్నది తెలిసిందే. కోటి కోసమే కోటి విద్యలు అన్నట్లు ఆహారాన్ని సంపాదించుకోవాలి అన్నా ముందు డబ్బు ఉండాలి. అందుకే జనాలు డబ్బులను సంపాదించుకోవడంలో కాలంతో పరుగులు తీస్తున్నారు. సుఖంగా సౌకర్యంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరికి వద్దన్నా డబ్బులు వచ్చి పడుతుంటే...మరి కొందరికి ఎంత సంపాదిస్తున్నా దానిని నిలబెట్టుకోలేక నానా తంటాలు పడుతుంటారు. అయితే ఇందుకు ప్రధాన కారణం మీ కష్టం అయితే ఉంటుంది. కానీ అందుకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తోడు లేకపోవడమే అని చెప్పాలి. శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లేకపోతే ఎంత డబ్బులు సంపాదించినా అది మీ చెంత నిలువదు. దాని కారణంగానే సమస్యలు పుట్టుకొస్తాయి అని కుటుంబంలో సంతోషం లేక పోవడం, వ్యాపారాల్లో నష్టాలు వంటివి జరుగుతుంటాయి.

అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవాలి, మాతకు కోపం తెప్పించకుండా చూసుకోవాలి. అవేంటో ఇపుడు చూద్దాం. నిత్యం మనం చేసే చిన్ని పొరపాట్లు కారణంగా లక్ష్మి దేవికి ఆగ్రహం తెప్పించి అనుగ్రహానికి దూరం చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటిని సరి చేసుకుంటే లక్ష్మి మాత కటాక్షం తప్పక పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు.

రోలు, రోకలి, పొయ్యి, చీపురు ఇవి అన్ని కూడా మంగళకరమైన వస్తువులు. వీటిని పవిత్రంగా చూసుకోవాలి  వీటికి కాలు తగలకూడదు. అలాగే వంటిల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేశాకే గ్యాస్ ను ముట్టుకోవాలి. అలాగే వంట అయ్యాక వంట గదిని నీట్ గా క్లీన్ చేసుకోవాలి లేదంటే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే మంచంపై కూర్చుని అన్నం తినకూడదు. లక్ష్మీ దేవి ప్రతి రూపంగా భావించే చీపురు ను పవిత్రంగా చూసుకోవాలి.  లేదంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చై పోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: