తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అతిపెద్ద పురాతన జీవిత బీమా ప్రొవైడర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఎల్ఐసి పెట్టుబడిదారుల అవసరాలు.. వయసు ప్రకారం కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతూ ఆర్థికంగా భరోసా ఇస్తోంది. ఈ క్రమంలోని పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని ఆలోచించే తల్లిదండ్రుల కోసం ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీని తీసుకోవడానికి పిల్లలకు కనీసం 90 రోజుల వయసు ఉండాలి. అలాగే 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు.

అటువంటి పరిస్థితుల్లో మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. జీవన్ తరుణ్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు హామీతో కూడిన రాబడిని పొందుతారు. వార్షిక , అర్థవార్షిక,  త్రైమాసిక లేదా నెలవారి ప్రాతిపదికన ఈ పథకంలో ప్రీమియం చెల్లించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ పాలసీ కింద పూర్తి ప్రయోజనాలు పొందుతారు. అయితే పిల్లల వయసు 20 సంవత్సరాలు వరకు మీరు ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ సమయంలో మీరు ఈ పథకంపై డబుల్ బోనస్ కూడా పొందుతారు.

ముఖ్యంగా ఈ పథకంలో చేరేటప్పుడు రూ.75, 000 కనీస హామీ మొత్తంతో తీసుకోవచ్చు.  అయితే గరిష్ట పరమతి అంటూ ఏమీ లేదు. ఉదాహరణకు జీవన్ తరుణ్ పాలసీ కింద మీరు మీ పిల్లల వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పాలసీని కొలగోలు చేస్తే..ప్రతిరోజు 150 రూపాయలు చొప్పున ఆధా చేస్తే మీ వార్షిక ప్రీమియం రూ.55,000 అవుతుంది. ఈ విధంగా 8 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ.4,40,665 అవుతుంది. మీరు పెట్టుబడి మొత్తం పై రూ.2,47,000 బోనస్ కింద పొందుతారు. దీని తర్వాత మీరు లాయల్టీ బోనస్ గా రూ.97,000 పొందుతారు.. ఈ విధంగా మొత్తం రూ.8,44,550 పొందుతారు . దీన్ని బట్టి చూస్తే పిల్లల భవిష్యత్తు కచ్చితంగా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: