మనలో ఎక్కువ శాతం ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తి స్వేచ్ఛగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ఆర్థిక స్వేచ్ఛ సాధించడానికి ఉత్తమమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో సరైన పథకాలను ఎంచుకోవాలని పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు అధిక రాబడిని ఇచ్చేలా చేస్తాయి. పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీం నేషనల్ పెన్షన్ సిస్టం స్కీం.


ఎవరైనా ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల పదవి విరమైన సమయంలో భారీ ఎత్తున నగదు తీసుకుంటారు అలాగే ప్రతి నెల కూడా పెన్షన్ లక్షలలో పొందే అవకాశం ఉంటుంది. రూ.1.14 లక్షల వరకు పెన్షన్ పొందాలనుకుంటే ఇలా చేయాల్సిందే..2004 లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టం స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా అమలు చేసేలా అనుమతించింది. 18 నుంచి 75 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా సరే ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. కనీసం 500 రూపాయలతో ప్రారంభించి గరిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు.


దీనిపై పెట్టుబడుల పెడితే పన్ను మినహాయింపు ఉండడమే కాకుండా గరిష్టంగా రెండు లక్షల వరకు ఉంటుంది. దీని మెచ్యూరిటీ సమయం ఖాతాదారుడు 60 ఏళ్ళు వయసు వచ్చేవరకు ఉంటుంది. కొన్ని షరతులతో లేదా ఖాతాదారుడు మరణ సమయంలోనే అకాల ఉపసంహరణలను అనుమతిస్తాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 25% మాత్రమే పిల్లల వివాహానికి, విద్యకు, అనారోగ్యంతో, ఇంటి కొనుగోలు నిర్మాణ సంస్థలలో ఉపహసంహరించుకోవచ్చు.NPS లో 30 సంవత్సరాల పాటు నెలకు 10,000 చొప్పున పెట్టుబడి పెడితే 60 ఏళ్ల నెలకు లక్ష కంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. అలా 30 ఏళ్లకు రూ .36 లక్షల రూపాయలు అవుతుంది.. 10% రాబడి అంచనా వేస్తే.. దాదాపుగా కోటి 91 లక్షలు అవుతుంది.. ఈ డబ్బులను మాన్యుటీలో పెట్టుబడి పెడితే నెలకి లక్షకుపైగా ఆదాయం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: