రణ్ బీర్ కపూర్ త్వరలోనే డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది. త్వరలో ఒక సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ అని దీనిని 10 ఎపిసోడ్లుగా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ సిరీస్ జాన్ లే కారే రచించిన 1993 నవల ఆధారంగా రూపొందించబడింది.