కార్తికేయ కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కార్తికేయను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అజిత్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తోన్న వలిమైలో కార్తికేయ కనిపించనున్నారు. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ట్వీట్ చేసిన కార్తికేయ, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అజిత్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తూ.... చాలా కష్టపడి, అందరూ గర్వపడేలాగా ఆ పాత్ర చేస్తానని తెలిపారు.