బాల సుబ్రహ్మణ్యం తండ్రి గారు హరికథలు చెబుతారు. ఆయన పేరు పండితారాధ్యుల సాంబమూర్తి. ఆ వాసన బాల సుబ్రహ్మణ్యం చిన్నప్పుడే ప్రవేశించింది. తండ్రి గారి పాటలు, సినిమా పాటలు పాడటం సాగించాడు. పాటలు పాడటంలో మంచిఉత్సాహం చూపాడు. అయితే సంగీతం నేర్చుకోలేదు. చదువు కోవడంతోనే సరిపోయింది.