తాజా సమాచారం ప్రకారం రానా మరియు శ్రుతిహాసన్ కలయికలో త్వరలో ఓ వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టనున్నారు. మహానటితో అందరినీ మెప్పించిన నాగ్ అశ్విన్ దీనికి కథను అందిస్తుండగా.. కొత్త దర్శకుడు చేతిలో ఈ కొత్త ప్రాజెక్టును పెడుతున్నారని భోగట్టా. వెబ్ సిరీసులు అన్నీ థ్రిల్లర్ కథలతో ముడిపడి ఉంటుండడంతో దీనిని కూడా అదే కోవలో చేయడానికి కసరత్తులు చేస్తున్నారు..