రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ శంషాబాద్ లో జరిగిన దిశ రేప్ సంఘటనపై దిశ ఎన్ కౌంటర్ అంటూ సినిమా తీశాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ సమయంలో దిశ తండ్రి మీడియా ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోను మరియు ఇప్పటి వరకు షూట్ చేసిన సినిమా మొత్తంను కూడా డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు.