షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'లవ్ స్టోరీ'.. మిగతా చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో నాగచైతన్య మూవీ కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందుకోసం ఇప్పటికే ప్రముఖ ఓటీటీలు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ లో ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.