పూరి చిత్రం తరువాత 2022 లో ఒక ప్రాజెక్ట్ కోసం శివ నిర్వాణ - సుకుమార్ లతో చేతులు కలుపుతున్నాడని తెలిసింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి అదే ఏడాది ద్వితీయార్థంలో ఓ సినిమా చేస్తాడు. అది ఓ రోమ్-కామ్ అని తెలిసింది. `పెళ్లి చూపులు`కి సీక్వెల్ గా ఉంటుందా? అన్నది విజయ్ నే చెప్పాలి. మరోవైపు మహేష్ తో కలిసి దేవరకొండ ఓ మల్టీస్టారర్ చేస్తారని.. అలాగే ఘట్టమనేని బ్యానర్ లో ఓ సినిమా చేస్తారని కూడా ప్రచారమైంది. మరి దానికి సంబంధించి ఇటీవల ఎలాంటి అప్ డేట్ లేదు.