కే జి ఎఫ్ చాప్టర్ 2 మొదటి పార్ట్ కంటే భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఒళ్ళు గగొర్పొడిచేలా ఉంటాయట.. ఈ క్రమంలోనే సినిమాలో భారీ క్లైమాక్స్ కు ప్లాన్ చేసినట్టు తెలిసింది.ఈ సినిమా హీరో యశ్ తోపాటు బాలీవుడ్ హీరో.. ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని క్లైమాక్స్ లో ప్లాన్ చేశారట.. ఈ క్లైమాక్స్ ను హైదరాబాద్ లో తెరకెక్కించుకున్నారని సమాచారం.