కొరటాల శివ ఆచార్య ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా కరోనా కారణంగా ఇంకా కొన్ని రోజులు వేచి చూసే ఆలోచనలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. తొలుత టెస్ట్ షూట్ చేశాకే చిరుని సెట్స్ కి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారట. అలాగే చిరు-చరణ్ కాంబినేషన్ చిత్రీకరణలకు సంబంధించిన ప్రత్యేకించి కేర్ తీసుకోనున్నారని తెలిసింది.