కరోనా వైరస్ కి ముందు భారీ అంచనాలతో మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది భీష్మ సినిమా. తన మొదటి సినిమా ఛలో తోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా అందరి అంచనాలకు మించి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఈ దసరాకు బుల్లితెరలో ప్రసారం కానుంది.